Aug 18,2022 23:18

ఆందోళన చేస్తున్న చైర్‌పర్సన్‌, కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:నర్సీపట్నం మెయిన్‌ రోడ్డును ఆనుకొని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్మిస్తున్న భవనంలో మృతి చెందిన గిరిజనుడు జర్త చందు కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందించాలని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద మున్సిపల్‌ చైర్‌ పర్శన్‌ గుడబండి ఆదిలక్ష్మీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తక్షణమే మృతుడి కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు, వైసిపి పట్టణ అధ్యక్షులు ఏకా శివ, కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ, జగదీశ్వరి, వైసిపి నాయకులు ఆరుగొల్లు రాజుబాబు, చోటి తదితరులు పాల్గొన్నారు.
రూ.50లక్షల పరిహారం ఇవ్వాలి
ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేష్‌
నర్సీపట్నం టౌన్‌:మృతి చెందిన గిరిజనుడు జర్త చందు కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందించాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులు, జర్త చందు భార్యతో మాట్లాడి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీడీపీ టౌన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న గవిరెడ్డి వెంకటరమణను కాంట్రాక్టర్‌గా పెట్టి నాలుగు నెలల క్రితం అగ్రిమెంట్‌ కాగితాలు సృష్టించారన్నారు. తప్పులు ధృవీకరణ పత్రాలు సృష్టించిన గవిరెడ్డిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. బిల్డింగ్‌ను సీజ్‌ చేయాలన్నారు. వైయస్సార్‌ భీమా తరపున చందు కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జర్త చందు కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపి బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్క్స్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు అడిగర్ల రాజు డిమాండ్‌ చేశారు. ఈ నెల 17న నర్సీపట్నం విశాఖ రోడ్డులోని ఒక భవన నిర్మాణం పనులో లిప్ట్‌ గోతులో పడి మరణించిన గిరిజనుడు జర్తా చంద్‌ కుటుంబాన్ని బుధవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా అడిగర్ల రాజు మాట్లాడుతూ నిరుపేద గిరిజన కార్మికుడు చందు కూలి పనికి వచ్చాడని, చందు మరణించడంతో కుటుంబం పెద్దదిక్కను కొల్యోయిందన్నారు. పని ప్రదేశంలో యాజమాన్యం భద్రత చర్యలు పాటించలేదన్నారు. కావున చందు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.