Nov 30,2022 23:11
జిల్లా జట్టుకు ఎంపికైన బాలికలు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: అండర్‌-14 బాలబాలికల హాకీ ఉమ్మడి గుంటూరు జిల్లా జట్టు ఎంపికలు మండలంలోని చెరువుజమ్ముల పాలెం జెడ్‌పి పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఎంపికలను బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి పివిజె రామారావు ప్రారంభించారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జిఎఫ్‌) రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు చేపట్టిన ఎంపికలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 150 మంది బాలబాలికలు హాజరవగా బాలుర జట్టుకు 18 మందిని, బాలికల జట్టుకు 18 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఎస్‌ఎం సుభాని, కె పుండరీకాక్షయ్య, పిఇటిలు పాల్గొన్నారు.