
వికారాబాద్ జిల్లా కొట్టాలగూడా గ్రామంలో బాలకృష్ణ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు బోయపాటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు అక్కడకు చేరుకునే సమయానికి గ్రామస్తులంతా ఆ ప్రాంతానికి చేరుకున్నారంట. ఒక్కసారిగా అంతమంది రావడం చూసి షూటింగ్ చూడడానికేమో అనుకున్నదంట చిత్రబృందం. కాని అనూహ్యంగా షూటింగ్ జరుగనివ్వం.. మా గ్రామంలో పెద్దఎత్తున వ్యవసాయ భూములు కబ్జా అయ్యాయి. ఇప్పుడు మా పరిస్థితి దయనీయంగా ఉంది. మా గ్రామంలో షూటింగ్ చేసుకోవాలంటే గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారంట గ్రామస్తులు. షూటింగ్ కోసం అనుమతులు తీసుకున్నాం అని చిత్రబృందం చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షూటింగ్ మొదలు పెట్టకుండానే పేకప్ చెప్పారు.