Oct 03,2022 01:17

బాలకృష్ణన్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు కొడియేరి బాలకృష్ణన్‌ మృతి సిపిఎం, వామపక్ష ఉద్యమానికి, కేరళ పార్టీకి తీరని లోటని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సిద్ధయ్య పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో బాలకష్ణన్‌ చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వై. సిద్ధయ్య మాట్లాడుతూ బాలకష్ణన్‌ చిన్న వయస్సులోనే ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ సంఘాలలో పలు బాధ్యతలు నిర్వహించి విద్యార్థి, యువజన ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. యుక్త వయస్సులోనే సిపిఎంలో చేరి ఎమర్జెన్సీ కాలంలో 16 నెలల పాటు జైల్లో ఉన్నారన్నారు. అనేక ప్రాంతాలలో మతోన్మాదులు చెలరేగినప్పుడు ముందు వరుసన నిలబడి వారి ఆగడాలను అడ్డుకున్నారన్నారు. మాస్‌లీడర్‌గా, పోరాటయోధుడిగా ప్రజానీకంలో బాలకృష్ణకు మంచి గుర్తింపునిచ్చిందన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ మాట్లాడుతూ కొడియేరి బాలకష్ణన్‌ మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తుందని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కొడియేరి మృతికి సంతాప సూచికంగా అన్ని పార్టీ కార్యాలయాల వద్ద అరుణ పతాకాలు మూడు రోజులపాటు అవనతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి.కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి జి.రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.రఘురామ్‌, పి.కల్పన, కె.రమాదేవి, సిపిఎం సీనియర్‌ నాయకులు నరసయ్య, మాదాల వెంకట్రావు, బాలచంద్రం, దామా శ్రీనివాసరావు, నగర నాయకులు తంబి శ్రీను, శ్రీరామ శ్రీనివాసరావు, బి.వెంకట్రావు, జి.రవి, తిరుపతయ్య, కార్యాలయ కార్యదర్శి షేక్‌ అమీర్‌ పాల్గొన్నారు..చీమకుర్తి : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కోడియేరి బాలకృష్ణన్‌ చిత్రపటానికి సిపిఎం మండల కమిటీ నివాలళుర్పించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరరావు మాట్లాడుతూ సుధీర్ఘకాలం ప్రజాజీవితంలో, కరోనా కాలంలో ఆయన బాలకృష్ణన్‌ చేసిన సేవలు మరువ లేనివన్నారు. సిపిఎం జిల్లా నాయకులు జి. శ్రీను మాట్లాడుతూ కోడియేరి బాలకృష్ణన్‌ పోరాటాలు ఎంతో స్పూర్తిదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పల్లాపల్లి ఆంజనే యులు రామారావు, కంకణాల వెంకటేశ్వర్లు, వీరాంజనేయులు,బి ఓబులేషు,ఆంజనేయరెడ్డి,డి నాగేశ్వరరావు, లక్ష్మినారాయణ, టిశ్రీను,నాగయ్య పాల్గొన్నారు. కనిగిరి : స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ రాష్ట్ర మాజీ కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌కు సిపిఎం శ్రేణులు ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి.కేశవరావు మాట్లాడుతూ బాలకృష్ణ నమ్మిన విలువల కోసం చివరకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్‌ బషీరా,జి.శ్రీనివాసులు, ప్రసన్న, యు. పిచ్చయ్య, మాలకొండయ్య, రమణమ్మ,శాంతకుమారి, ఎలీషమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.