Apr 20,2021 21:39

మాట్లాడుతున్న కృష్ణారావు

వంగర : బాల్య వివాహాలు చట్టరత్యా నేరమని చైల్డ్‌లైన్‌ ఏరియా కో-ఆర్డినేటర్‌ ఎం.కృష్ణారావు అన్నారు. మండలం లోని మడ్డువలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలు 18 ఏళ్లు, బాలురుకు 21 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవా లని సూచించారు. వివాహ వయస్సు నిండక ముందు పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టాలు గురించి వివరించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆడ పిల్లలను ఎవరైనా వేధించినా, హింసకు గురి చేసినా దిశ చట్టం కింద కేసులు నమో దు చేస్తామన్నారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే టోల్‌ ఫ్రీ నంబరు 1098కు కాల్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శశిధర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి శివన్నారాయణ, చైల్డ్‌లైన్‌ సిబ్బంది నాగమణి లక్ష్మీనరసింహ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.