Jun 10,2021 18:45

గురువారం నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ మూవీ మేకర్స్‌ విడుదల చేశారు. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమా చేస్తున్నట్లు పోస్టర్‌ విడుదలైంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుందంటూ వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణని పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. బాలయ్య ద్విపాత్రాభినయంలో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ భారీఎత్తున తెరకెక్కించనుంది.