Jul 29,2021 19:28

abhinandistunna sibbandi

బాపులపాడు ఎంపిడిఒగా ప్రసాదరావు బాధ్యతలు
ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌
బాపులపాడు ఎంపిడిఒగా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉంగుటూరు ఎంపిడిఒగా ఆయన పనిచేశారు. నూతన ఎంపీడీఓ ప్రసాదరావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కోసం తాను కృషిచేస్తానని చెప్పారు. కరోనా థర్డ్‌ వేవ్‌ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉపాధి హామీ పనులు జరిగే చోట ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. వైద్య, ఆరోగ్యశాఖ సూచించిన విధంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.