Feb 06,2023 21:31

బడ్జెట్‌ పత్రాలు దహనం చేస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి - వంగర : కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ రాజాం మండలంలో గారా చీపురుపల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో బడ్జెట్‌ పత్రాలను సోమవారం దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం శాఖ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడారు. కార్యక్రమంలో రాంబాబు, శ్రీనివాసరావు, శంకర్రావు, చిరంజీవి, రవి, కృష్ణారావు, తేజ, ఈశ్వరరావు, మారిబాబు పాల్గొన్నారు. నెల్లిమర్ల: రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని చెప్పుకుంటున్న నాయకులు విభజన హామీలు, ప్రత్యేక హోదా ఎక్కడికి పోయిందో చెప్పాలని సిఐటియు జిల్లా నాయకులు కిల్లంపల్లి రామారావు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రైతులకు ఎరువుల్లో సబ్సిడీ కోత విధించి బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని విమర్శించారు.