Oct 13,2021 21:08

ప్రజాశక్తి- బద్వేలు
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక పోరులో 15 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో వైసిపి అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ, కాంగ్రెస్‌ అభ్యర్థి పి.ఎం.కమలమ్మ, బిజెపి అభ్యర్థి పి.సురేష్‌, మరో 12 మంది ఉన్నారు. మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా తొమ్మిది మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ నెల 30న ఎన్నిక, నవంబర్‌ రెండున కౌంటింగ్‌ జరగనుంది.