Jan 14,2022 21:46

ప్రొ కబడ్డీ లీగ్‌
బెంగళూరు: ప్రొ కబడ్డీలీగ్‌(పికెఎల్‌) సీజన్‌ా8లో భాగంగా శుక్రవారం జరిగిన పోటీల్లో పింక్‌ ప్యాంథర్స్‌, బెంగళూరు బుల్స్‌ విజయాలను నమోదు చేసుకున్నాయి. పింక్‌ ప్యాంథర్స్‌ జట్టు 38ా29 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌ను, బెంగళూరు జట్టు 46ా37పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించాయి. పింక్‌ ప్యాంథర్స్‌ జట్టులో దీపక్‌ హుడా(10), అర్జున్‌(9) రైడ్‌లో రాణించగా.. షాహుల్‌ కుమార్‌(4) ట్యాకిల్స్‌లో మెరిసాడు. పింక్‌ ప్యాంథర్స్‌ జట్టు 4సార్లు పట్నాను ఆలౌట్‌ చేయడంతో విజయం సునాయాసమైంది. ఇక బెంగళూరు జట్టు రైడర్‌ పవన్‌ కుమార్‌(19) ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. రైడ్‌, ట్యాకిల్స్‌లో ఇరుజట్లు సమంగా రాణించినా.. 6సార్లు బెంగళూరు జట్టు గుజరాత్‌ను ఆలౌట్‌ చేయడంతో విజయం సాధించగల్గింది.