Sep 15,2021 22:04

sayam chestunna trust pratinidhulu

బెరాక మినిస్ట్రీస్‌ భరోసా
ప్రజాశక్తి-కలక్టరేట్‌
స్థానిక లక్ష్మణరావుపురంలో నివాసం ఉంటున్న ఎం.స్వర్ణ కుమారిని ఆమె భర్త వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె, పిల్లలను సైతం ఇంటి నుంచి గెంటేశాడు. ఆమె దీన స్థితిని గుర్తించిన జిల్లా ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌, ఏ ఆర్‌ అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణలు 'బెరాకా మినిస్ట్రీస్‌' వారికి రిఫర్‌ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ బెరాకా మినిస్ట్రీస్‌ వారు మూడు నెలలపాటు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి నెలా రూ.9000 చొప్పున మూడు నెలలకు రూ.27 వేలు మొదటి విడత చెక్కును అందజేశారు.