Nov 25,2021 07:24

లండన్‌ : నిద్రపోతున్న తన మూడు మాసాల చంటిబిడ్డను తీసుకుని పార్లమెంటు కు హాజరైన ప్రతిపక్ష లేబర్‌ ఎంపీస్టెల్లా క్రీజీని అధికారులు మందలించడంతో ఆమె ఆగ్రహించారు.సభలో సభ్యులు చేసిన గొడవ కన్నా ఈ పసి బిడ్డ చేసే అల్లరి తక్కువే అని ఆమె అన్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో ఆమెకు పలువురు ఎంపీలు మద్దతు తెలిపారు. ఆచరణలో ఇప్పటికే వున్న పద్ధతులకు విరుద్ధంగా ఇది ఉందన్నారు. పార్లమెంట్‌ సభ్యులకు కూడా ప్రసూతి సెలవు ఉండాలని స్టెల్లా క్రీజీ ఎప్పటినుంచో పోరాడుతున్నారు.