Oct 16,2020 21:14
బిఎండబ్ల్యు నుంచి '2 సిరీస్‌ గ్రాన్‌ కూపే'

న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం బిఎండబ్ల్యూ తాజాగా భారత మార్కెట్లోకి 2 సిరీస్‌ గ్రాన్‌ కూపే మోడల్‌ను విడుదల చేసింది. డీజిల్‌ ఇంజన్‌ వేరియంట్‌తో తీసుకువచ్చిన ఈ కారు ధరలను ఎక్స్‌షోరూం వద్ద రూ.39.3 లక్షలు, రూ.41.4 లక్షలుగా నిర్ణయించింది. పొడవైన ఫ్లోయింగ్‌ సిల్టౌట్‌, ప్రేమ్‌లెస్‌ డోర్స్‌తో ఆకట్టుకునే డిజైన్‌లో దీన్ని రూపొందించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ట్విన్‌ టర్బో 2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌, 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2 సిరీస్‌ గ్రాన్‌ కూపే కేవలం 7.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఇందులో త్వరలో పెట్రోల్‌ ఇంజన్‌ వేరియంట్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌ కార్లకు క్రమం తప్పకుండా చేయించే సర్వీసు ఖర్చు ప్రతీ కిలోమీటర్‌కు రూ.1 కన్నా తక్కువగా ఉంటుందని, డీజిల్‌ కార్లకు రూ.1.5గా ఉంటుందని తెలిపింది. వినియోగదారలు అడ్డంకులు లేని యాజమాన్యపు అనుభవాన్ని ఆస్వాదంచవచ్చని పేర్కొంది. చెన్నరులోని బిఎండబ్ల్యు ప్లాంట్‌లో దీన్ని తయారు చేసింది.