Oct 13,2021 20:07

దర్శకుడు బి. గోపాల్‌ సత్యజిత్‌ రే స్మారక పురస్కారం అందుకున్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత మూడేళ్ళుగా కేరళకు చెందిన సత్యజిత్‌ రే ఫిల్మ్‌ సొసైటీ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ఈ పురస్కారంతో సత్కరిస్తోంది. గతంలో ఈ అవార్డులను ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, బెంగాలీ నటి మధబ్‌ ముఖర్జీ , నిర్మాత జి. మోహన్‌ స్వీకరించారు. రవీంద్రభారతిలో జరిగిన సత్కార సభలో సత్యజిత్‌ రే ఫిల్మ్‌ సొసైటీ సభ్యులు సజన్‌ లాల్‌, సెబాస్టియన్‌, అజిత్‌ తదితరులు పాల్గని, బి. గోపాల్‌ దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. తెలుగు, హిందీ భాషలలో దాదాపు 35 చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు బి. గోపాల్‌ తాజాచిత్రం 'ఆరుడుగుల బుల్లెట్‌' గత వారమే విడుదలైంది.