
కారంచేడు : టాలీవుడ్ అగ్రనటుడు, హిందూ పురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి పండుగను కారంచేడులోని తన సోదరి పురంధేశ్వరి ఇంట్లో జరుపుకుంటున్నారు. ఇప్పటికే వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కూడా. సంక్రాంతి రోజు గుర్రంపై సందడి చేసిన బాలయ్య. కనుమ రోజైన ఆదివారం..చీరాల బీచ్‌కు కుటుంబ సభ్యులతో వెళ్లారు. బీచ్ వద్ద జీప్‌లో తన భార్యతో కలిసి చక్కర్లు కొట్టారు. ఈ వీడియో కూడా ఇంటర్నెట్లో గిర్రున తిరుగుతోంది.