
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పూణెలోని తన కార్యాలయంలోకి ప్రవేశించి తనను చెప్పుతో కొట్టారని రాష్ట్ర బిజెపి నేత వినాయక్ అంబేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాన్ కాగ్నిజబుల్ నేరం కింద నలుగురిపై కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని అన్నారు. ఎన్‌సిపి కార్యకర్త పన్ను సంబంధిత అంశాల గురించి తెలుసుకునేందుకు శనివారం తన కార్యాలయానికి వచ్చాడని, అప్పుడు తనపై దాడి చేసి దుర్భాషలాడారని అన్నారు. ప్రముఖ రాజకీయ నేత, ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్‌పై దుర్భాషలాడారంటూ కొందరు ఎన్‌సిపి కార్యకర్తలు మహారాష్ట్ర బిజెపి ప్రతినిధిపై దాడి చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
శరద్ పవార్‌పై అభ్యంతరకర పోస్టులు చేశారంటూ మరాఠి నటి కేతకి చైతాల్, నిఖిల్ భమ్రేలపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేతకి చైతాల్కి ఈ నెల 18 వరకు పోలీస్‌కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.