
న్యూఢిల్లీ : ఊహించినట్లుగానే సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు, ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ మరదలు అపర్ణా యాదవ్ బుధవారం బిజెపిలో చేరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో మొదలౌతుండగా.. ఈ పరిణామం ఎస్పికి ఝలక్నిచ్చినట్లైంది. అపర్ణ .. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ సతీమణి. కాగా, బిజెపికి కాస్త ఊరట కలిగించే అంశం. ఇప్పటికే పలువురు మంత్రులు, వెనుకబడిన తరగతికి చెందిన నేతలు బిజెపిని వీడి ఎస్పి గూటికి చేరిన సంగతి తెలిసిందే.