
ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఎంబిఎ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బిజినెస్ ఎనలిటిక్స్ పై రెండు రోజుల వర్క్ షాపును నిర్వహించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. వర్క్‌షాపులో హైదరాబాద్ గీతమ్స్ అద్యాపకులు సిహెచ్ శంకర్, ఎంబిఎ హెచ్‌ఒడి ఆర్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు. తద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. బిజినెస్ ఎనలిటిక్స్‌ను అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టినట్లైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతను పరిశ్రమల అవసరాలను బట్టి బిజినెస్ ఎనలిటిక్స్ లోని అనేక అంశాలను, వ్యూహాలను అమలుచేస్తే పరిశ్రమలలో గణనీయమైన వృద్ధి సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంకు ఎస్ చాంద్‌బాషా కన్వీనర్‌గా వ్యవహరించారు.