Sep 14,2021 23:22

ప్రజాశక్తి-కంభం: మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అప్పుల సుడిగుండంలో చిక్కుకున్నారని, వీరికి తక్షణమే బిల్లులు, వేతన బకాయిలు చెల్లించి.. ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పివి.శేషయ్య ప్రభుత్వ అధికారులను కోరారు. అర్ధవీడు ఎంఇఒకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మధ్యా హ్న భోజన పథకం వర్కర్లు పివి.రమణ, ఆదిలక్ష్మీ, షేక్‌ మాబున్ని, లక్ష్మీదేవి, రమాదేవి, విశ్రాంతమ్మ, కవిత, అనూష, ఎల్లమ్మ, సుబ్బులు, రామలక్ష్మీ, జ్యోతి, వీరమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.