Aug 07,2022 22:29

ఫొటో : తిరుపతిరెడ్డిని సత్కరిస్తున్న దృశ్యం

ఫొటో : తిరుపతిరెడ్డిని సత్కరిస్తున్న దృశ్యం
బిపిఎం తిరుపతిరెడ్డికి ఘన సన్మానం
ప్రజాశక్తి-ఉదయగిరి: గ్రామీణ పోస్టల్‌ శాఖలో బిపిఎం ఎఐజిడి ఎస్‌యుయూనియన్‌ నాయకులుగా ముటుకుందు తిరుపతిరెడ్డి సేవలు అభినందనీయని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం మండల పరిధిలోని గండిపాలెం గ్రామంలోని పాఠశాల ఆవరణంలో సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ శివ ప్రసాద్‌ అధ్యక్షతన సిబ్బంది పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కల్లూరి వెంకటేశ్వర్‌ రెడ్డి పలువురు ఆయనను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన సేవలు అమోఘం, అభినందనియమని కొనియాడారు. తపాలా ఉద్యోగుల సమస్యలపై అలుపెరగక అనునిత్యం పోరాటంలో పాల్గొని ఢిల్లీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అరెస్ట్‌ ఆయన వ్యక్తి తిరుపతిరెడ్డి అని ప్రశంశల వర్షం కురిపించారు.
ఏ ఒక్కరికీ అవసరం వచ్చినా తిరుపతిరెడ్డిని ఆశ్రయించి న్యాయం పొందిన వారు ఎందరో ఉన్నారని సున్నితమైన హృదయం కలిగిన వారని ఆయన అందించిన సేవలు మరువలేమని వివరించారు. తపాలా ఉద్యోగంలో విరమణ పొందిన రాజకీయ వ్యక్తిగా ప్రజల మనిషిగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుంటూ కుటుంబ సమేతంగా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు సిబ్బంది కోరిక మేరకు షష్టిపూర్తి వేడుకలను నిర్వహించి విరమణ కార్యక్రమాన్ని వారి దంపతులను శాలువలు పూల మాలలతో సత్కరించారు. కార్యక్రమంలో తపాలా అధికారులు, కొండాయపాలెం ఎంపిటిసి, సర్పంలు కె.కృష్ణ, భారతి తిరుపతి, నాయకులు అడుసు మళ్లీ వెంకటేశ్వర రెడ్డి, భాషా, సచివాలయ, పోస్టల్‌ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.