Jul 29,2021 22:14

మాట్లాడుతున్న రైల్వే అభివద్ధి కమిటీ ప్రతినిధి షేక్‌ నూరుద్దీన్‌



మాట్లాడుతున్న రైల్వే అభివద్ధి కమిటీ ప్రతినిధి షేక్‌ నూరుద్దీన్‌
బిట్రగుంటను అభివృద్ద్ధి చేయండి
ప్రజాశక్తి-బిట్రగుంట:బిట్రగుంట అభివద్ధి విషయంలో వెనకబడిందని ఎన్నోసార్లు కేంద్ర మంత్రులకు, జిల్లా ఎంపిలకు, ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. నేడు జిల్లాకు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి బిట్రగుంట ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, బిట్రగుంట రైల్వే అభివద్ధి కమిటీ ప్రతినిధి షేక్‌ నూరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గురువారం బిట్రగుంట రైల్వే అభివద్ధి కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి శాసనసభ్యులు ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంత అభివద్ధికి చర్యలు తీసుకోవాలని .బిట్రగుంట రైల్వే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటం వల్ల అభివద్ధి నోచుకోలేదన్నారు.
రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలను బిట్రగుంటలో ఏర్పాటు చేయాలని తద్వారా ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యను ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో బిట్రగుంట రైల్వే అభివద్ధి కమిటీ సభ్యులు షేక్‌ హుస్సేన్‌ బాషా, ఏనుగుల విజరు ప్రతాప్‌ రెడ్డి, అహ్మద్‌ ,ఎం.డి రఫీ, షేక్‌ నౌషాద్‌ తదితరులు పాల్గొన్నారు.