Sep 13,2021 19:08

రోజుకు ఒక్కసారైనా బ్లాక్‌ టీ తాగాలని సిఫార్సు చేస్తున్నారు అమెరికన్‌ పరిశోధకులు. వేడివేడి 'టీ' వల్ల శరీరానికి ఉత్తేజం వస్తుందని హామీ ఇస్తున్నారు. అలసట, ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. బ్లాక్‌ టీ వల్ల క్యాన్సర్‌, ఊబకాయం లాంటి సమస్యలు దరి చేరకుండా చూస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు, బ్లాక్‌ టీ శరీర నొప్పులనూ తగ్గిస్తుంది. మలబద్ధ్దకం సమస్య సైతం తీరిపోతుందని నిర్ధారిస్తున్నారు పరిశోధకులు. టీలో తేనె, బెల్లం మొదలైన సహజ తీపి పదార్థాలను జోడిస్తే మంచిదంటున్నారు.
అంతేకాదు బ్లాక్‌ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా మారే వీలుంటుంది. అంతేకాదు ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులు దరిచేరవు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

బ్లాక్‌ టీ తయారీవిధానం:
బ్లాక్‌ టీని కూడా మామాలు టీ మాదిరిగానే తయారుచేయవచ్చు. కాకపోతే ముందుగా నీటిని మరిగించి, అందులో టీ పౌడర్‌ వేసుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు చక్కెర లేదా బెల్లం లేదా తేనె, సహజ తీపి పదార్థాలను వేయాలి. తర్వాత యాలకులు, అల్లం లేదా నిమ్మరసం కలుపుకోవాలి.