
ప్రజాశక్తి- విజయనగరం కోట : ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, బ్యాంకుల్లో ప్రభుత్వం పెట్టిస్తున్న కార్పొరేట్ బలవంతపు పెట్టుబడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఎల్‌ఐసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యాన సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్‌లతో ఎల్‌ఐసిలో బలవంతపు పెట్టుబడులు పెట్టించి వేల కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి తరువాత ఎగ్గొట్టడం షరా మమూలుగా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను దివాళా తీయించేందుకు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు చేపడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి జాబితాలో చేర్చకుండా బడా బాబుల పక్షాన నిలబడి వేల కోట్లు సంపాదన అర్థించడంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రానున్నకాలంలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బొబ్బిలి టౌన్ అధ్యక్షులు ఎన్. వెంకట్రావు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, చీపురుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు టి.సూర్యనారాయణ, నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు డి.గురువులు చంద్రశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.