May 14,2022 11:15

లండన్‌: బట్టతల ఉన్నవారిని వెక్కిరిస్తే లైంగిక వేధింపు కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చింది.. టోనీ అనే వ్యక్తికి బట్టతల ఉంది. టోనీ తన కంపెనీ సూపర్‌వైజర్‌తో గొడవకు దిగాడు. దీంతో అతను టోనీ బట్టతలను ఎగతాళి చేయడంతో సూపర్‌వైజర్‌పై కేసు వేశాడు. అయితే, ఈ కేసులో భాగంగా, జుట్టు లేకపోవడంపై కామెంట్‌ చేయడం అవమానించడం కిందకు వస్తాయా, వేధింపుల కిందకా అనే అంశంపై ట్రిబ్యునల్‌ విచారణ జరిపింది. కేవలం బట్టతల ఉందన్న కారణంతో అవమానిస్తే... అది లైంగిక వేధింపేనని ట్రిబ్యునల్‌ తేల్చింది.