
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : బంగారం మాయంపై ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నెలరోజుల్లో బంగారం ధరను చెల్లిస్తామని యూనియన్ బ్యాంక్ ఎజిఎం ఎం.రవీంద్ర నాయక్ ఖాతాదారులకు హామీనిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల యూనియన్ బ్యాంక్‌లో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయంపై ఖాతాదారులు సోమవారం మరోసారి ఆందోళన చేపట్టారు. బ్యాంకుకు తాళం వేసి బ్యాంకు సిబ్బందిని అడ్డుకున్నారు. తమ బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, అప్పటి వరకూ లోపలికి వెళ్లనివ్వబోమని పట్టుబట్టారు. ఇది తెలిసిన బ్యాంక్ జోనల్ అధికారులు హుటాహుటిన రెంటపాళ్లకు చేరుకున్నారు. బాధితులతో బ్యాంకు ఎజిఎం రవీంద్ర నాయక్ మాట్లాడారు. బంగారం పోయిన ప్రతి ఒక్కరికీ హామీ పత్రాలు. రాసీస్తామని, నెలలో డబ్బులు ఇస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.