Oct 13,2021 20:43
బంగారం రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు : పిఎన్‌బి

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) బంగారం తనఖాపై చౌక వడ్డీ రేటుతో రుణాలు అందిస్తున్నట్లు తెలిపింది. కొత్త పథకంలో భాగంగా బంగారు ఆభరణాలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ రుణాలపై వడ్డీ రేటును 145 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జిబి)పై 7.2 శాతం, బంగారు అభరణాలపై 7.30శాతం రేటును అమలు చేస్తున్నట్లు తెలిపింది. గృహ రుణాలు 6.60 శాతం నుంచి, కార్లపై 7.15 శాతంతో, వ్యక్తిగత రుణాలపై 8.95 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు పేర్కొంది.