Jun 02,2023 16:02
  • ప్రారంభోత్సవం చేసిన గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి

ప్రజాశక్తి-అర్దవీడు:-   ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం, నాగులవరం గ్రామంలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి ముఖద్వార ప్రారంభోత్సవం మరియు శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మరియు బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ వేడుకలకు గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఎడ్ల బండలాగుడు పోటీలను అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు భక్తులు  పాల్గోన్నారు.