Sep 21,2022 22:10

మాట్లాడుతున్న జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య రంగజనార్దన

ప్రజాశక్తి-అనంతపురం     అనంతపురం జేఎన్టీయూ పరిధిలో అడహక్‌ ప్రాతిపదికన పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ ప్రతి ఒక్కరూ బోధనా నైపుణ్యాలను పెంచుకోవడంతో పాటు రీసెర్చ్‌ ప్రాజెక్టులు దరఖాస్తు చేసుకుని తెచ్చుకోవాలని జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య రంగజనార్ధన సూచించారు. బుధవారం స్థానిక జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల మెకానికల్‌ సెమినార్‌ హాల్‌ నందు కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య పి.సుజాత అధ్యక్షతన వివిధ విభాగాధి పతులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య రంగజనార్ధన మాట్లాడుతూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌కు ప్రభుత్వం ఇచ్చిన జీవో 110ని వర్శిటీలో అమలు చేస్తామని తెలిపారు. ఈ జీవో ద్వారా ప్రతి సంవత్సరం వారికి వచ్చే బెనిఫిట్స్‌ అమలుచేస్తామన్నారు. రీసెర్చ్‌ ప్రాజెక్టులకు అప్లై చేసి వాటిని తెచ్చుకోవాలని, బోధనా నైపుణ్యాన్ని పెంపొందించు కోవాలని సూచించారు. వర్శిటీలో నిర్వహించే వివిధ వర్క్‌ షాపులకు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాములకు హాజరై కొత్త కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ-కంటెంట్‌ డెవలప్‌ చేసుకోవాలన్నారు. పిహెచ్‌డి రిజిస్టర్‌ అయిన ప్యాకల్టీ త్వరితగతిన పూర్తి చెయ్యాలన్నారు. మంచి జర్నల్స్‌ పబ్లిష్‌ అయ్యేలా ప్రతి ఒక్కరూ కృచేయాలన్నారు. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా ప్రతి అధ్యాపకుడు సిలబస్‌లోని మార్పులను అధ్యయనం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య విజయకుమార్‌, అకడమిక్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య వి.సుమలత, వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య భవాని, వివిధ విభాగాధి పతులు, అడహక్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.