
రియో : బ్రెజిల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,195 మంది మృత్యువాత పడ్డారు. కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు బ్రెజిల్లో కోటి 30 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొంత మంది రోగుల అయితే ఆసుపత్రుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల బ్రెజిల్లో మఅతి చెందిన వారి సంఖ్య 3,37,000కు చేరువైంది. ఈ ఏడాది మార్చిలోనే ఆ దేశంలో వైరస్ వల్ల 66,570 మంది మరణించారు. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది బ్రెజిల్లోనే. అయితే మహమ్మారిని అదుపు చేసేందుకు అధ్యక్షుడు జెయిర్ బల్సనారో మాత్రం లాక్డౌన్ అమలు చేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. వైరస్ నష్టం కన్నా.. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఆయన వాపోతుండటం గమనార్హం.