Feb 23,2021 11:08

న్యూఢిల్లీ : బ్రిక్స్‌ సమ్మిట్‌లో పాల్గనేందుకు ఈ ఏడాది రెండో భాగంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌కు రానున్నారు. గత కొద్ది నెలలుగా ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్రమైన సంక్షోభాలు నెలకొన్న నేపథ్యంలో.. జిన్‌పింగ్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) బ్రిక్స్‌ సమ్మిట్‌కు ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌కు చైనా మద్దతు ప్రకటిస్తుందని, అలాగే ఇరు దేశాల సరిహద్దుల మధ్య తలెత్తిన వివాదాలు ఈ సమావేశంపై ఎటువంటి ప్రభావం చూపవని చైనా పేర్కొంది. ఈసమ్మిట్‌లో భారత్‌తో పాటు ఇతర దేశాల నేతలు జరిపే చర్చలను బలోపేతం చేసేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వాన్‌బిన్‌ తెలిపారు.