Jun 10,2021 21:11

బర్మింగ్‌హామ్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండోటెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు తడబడింది. గురువారం టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టుకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు సిబ్లేాబర్న్స్‌ 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గట్టి పునాది వేశారు. సిబ్లే(35)ను పెవీలియన్‌కు పంపి హెన్రీ ఈ జోడీని విడదీశాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బర్న్స్‌(81) అర్ధసెంచరీతో రాణించగా.. క్రాలే(0), రూట్‌(4) వికెట్‌ కీపర్‌ బ్రేస్‌(0) నిరాశపరిచారు. అనంతరం న్యూజిలాండ్‌ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ జట్టు కడపటి వార్తలందే సమయానికి 61 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. బౌల్ట్‌, హెన్రీకి రెండేసి, వాగర్‌, అజాజ్‌ పటేల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.