Oct 13,2021 20:04
బుల్లితెరపై బాలకృష్ణ సందడి

బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ 'ఆహా'లో టాక్‌షో చేయబోతున్నారు. 'అన్‌ స్టాపబుల్‌' పేరుతో బాలకృష్ణ చేయబోతున్న ఈ షో గురించి ఆహా గురువారం అధికారికంగా ప్రకటించనుంది. 'బాప్‌ ఆఫ్‌ ఆల్‌ టాక్‌ షోస్‌-అన్‌ స్టాపబుల్‌' అంటూ ఆహా ప్రచారం చేస్తుంది. ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను అల్లు అరవింద్‌ గురువారం ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్‌ చరణ్‌ పాల్గంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్‌లో మంచువారి కుటుంబసభ్యులతో ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్‌ షో ఉంటుందట. మరి ఇలాంటి కాంబినేషన్స్‌ కలయికతో రాబోతున్న ఈ టాక్‌ షో నిజంగానే 'బాప్‌ ఆఫ్‌ ఆల్‌ టాక్‌ షోస్‌' అనిపించుకుంటుందేమో!