
ప్రజాశక్తి - కవిటి: ఈనెల 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించనున్న ఖేల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కవిటికి చెందిన తుంగాన శరత్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎపిబిఎ ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరి ఆదివారం నియామక ఉత్తర్వులు అందజేసినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తమరాల జయరాం తెలిపారు. ఉద్దాన ప్రాంతం నుంచి తొలిసారి జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన శరత్‌కు ఉషోదయ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ లోళ్ల రాజేష్, ఉపాధ్యక్షుడు బెందాళం రమేష్, ఉషోదయ యువజన సంఘం అధ్యక్షులు పాండవ శేఖర్, మాజీ అధ్యక్షులు ఎ.మధు, కార్యదర్శి పులకల వెంకటరావు, క్రీడాకారులు ప్రసాద్, ఆర్.ఈశ్వరరావు, పి.ఉమ, బి.విశ్వనాథం తదితరులు అభినందనలు తెలిపారు.