Apr 08,2021 09:27

విజయనగరం : విజయనగరంలోని సీతానగరం మండలం అంటిపేట ఎంపిటిసి స్థానానికి సంబంధించి బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదయింది. దీంతో గురువారం నిర్వహించాల్సిన పోలింగ్‌ వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌ తెలిపారు. ఆ స్థానంలో పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థి శనపతి నిర్మలకు బదులుగా పోటీ నుంచి విరమించిన శనపతి లక్ష్మి పేరు ఉంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ఫామ్‌-9 లో పేరు మారడంతో అంటిపేట ఎంపిటిసి స్థానం పరిధిలోని 20, 21, 22 నంబరు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ కు సిఫారసు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు.