Jul 29,2021 22:58

- బ్యాంకు మేనేజర్‌ ని సన్మానిస్తున్న దశ్యం

ప్రజాశక్తి - మిడుతూరు: మిడుతూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ ఆంజనేయులు బదిలీపై కర్నూల్‌లోని పూల బజార్‌ బ్రాంచికి బదిలీ అయిన సందర్భంగా గురువారం మండలంలోని పొదుపు సంఘాల మహిళలు, వివోలు, బుక్‌ కీపర్‌ గురువారం ఘనంగా సన్మానించారు. వెలుగు ఏపిఎం కల్పలత మాట్లాడుతూ పొదుపు మహిళల లోన్లకు, రైతులకు వ్యాపారస్తులకు సహాయ సహకారాలు అందించిన మేనేజర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నూతనంగా వచ్చిన మేనేజర్‌ వసీం అత్తర్‌ను, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ రాఘవేంద్రను సన్మానించారు. వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.