May 17,2022 20:31

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో రూ.40,295 కోట్ల విలువ చేసే మోసాలు నమోదయ్యాయని ఆర్‌బిఐ తెలిపింది. 2020-21లో జరిగిన రూ.81,922 కోట్ల మోసాలతో పోల్చితే 51 శాతం తగ్గుదల చోటు చేసుకుందని సమాచార హక్కు చట్టం కింద వెల్లడించింది. 12 పిఎస్‌బిల్లో 2020-21లో 9,933 కేసులు నమోదు కాగా.. 2021-22లో 7,940 మోసపు కేసులు చోటు చేసుకున్నాయి. 2021-22లో పిఎన్‌బిలో అత్యధికంగా రూ.9,528 కోట్ల మోసాలు జరిగాయి. ఎస్‌బిఐలో రూ.6,932 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.3,989 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌లో రూ.3,939 కోట్ల విలువ చేసే మోసాలు చోటు చేసుకున్నాయి.