Oct 28,2021 10:34

ముంబయి : గత రెండు రోజులుగా లాభాల వైపుగా వెళ్లిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. గురువారం నేలచూపులు చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.అక్టోబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ముదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్‌ 363 పాయింట్లు పతనమై 60,780, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 18,092 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఆటో, ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్య్సురెన్స్‌, నెస్లే షేర్లు లాభాల బాటలో నడుస్తుండగా.. టైటాన్‌, ఒఎన్‌జిసి, ఐసిసిఐ బ్యాంక్‌, హిందాల్కో, ఆదానీ పోర్ట్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.