Jun 11,2021 21:06

పట్టుబడిన సారా క్యాన్లు

ప్రజాశక్తి-బొబ్బిలి : భారీగా సారా క్యాన్లను ఎస్‌ఇబి సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి సారా తరలిస్తున్న టాటా సుమోను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఇబి ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.విజయకుమార్‌ తెలిపారు.
ఒడిశా రాష్ట్రం అలమండ నుంచి టాటా సుమోతో సారా తరలిస్తున్నట్లు ఎస్‌ఇబి అధికారులకు సమాచారం రావడంతో గురువారం రాత్రి మారువేషాలతో మాటువేశారు. పోలీసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు గ్రంధి రామారావు మోటార్‌సైకిల్‌పై ముందు వచ్చి టాటా సుమో డ్రైవర్‌ పప్పల సతీష్‌కు తెలియజేసేవాడు. పాతబొబ్బిలి జంక్షన్‌ వద్ద టాటా సుమో వచ్చేసరికి ఎస్‌ఇబి సిబ్బంది సుమోను అడ్డగించారు. 30 సారా క్యాన్లతో సుమోను సీజ్‌చేసి డ్రైవర్‌ సతీష్‌, ఎస్కార్ట్‌ రామారావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏప్రిల్‌ 26న టాటా ఏస్‌ వాహనంలో నాటుసారా తరలిస్తూ తప్పించుకుని పారిపోయిన పిల్ల శ్రీరాములును అరెస్టు చేసినట్లు విజయమోహన్‌ చెప్పారు.