May 17,2022 21:51

న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మంగళవారం ఉదయానికి గత 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే 600 మేర కేసులు తగ్గాయి. సోమవారం 3.57 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. సోమవారం 19 మంది మరణించారు. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెల్లడించింది. రోజువారీ పాజివిటీ రేటు 0.44 శాతానికి చేరింది. సోమమవారం 2,467 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకగా..98.75 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 16,400కు తగ్గాయి.