Sep 15,2021 17:44

poster nu aviskaristunna nayakulu

భారత్‌ బంద్‌ ను జయప్రదం చేయండి
ప్రజాశక్తి-మొవ్వ
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించే భారత్‌ బంద్‌ కు వ్యాపారస్తులు, ప్రజలు పూర్తిగా సహకరించాలని ఆ పార్టీ పామర్రు నియోజకవర్గ కార్యదర్శి దగాని సంగీతరావు కోరారు. కూచిపూడి-పెదపూడి సెంటర్‌లోని సిపిఐ కార్యాలయంలో బుధవారం గోడ పత్రికను ఆవిష్కరించారు. చెరుకు శ్రీనివాసరావు, చందోలు నాగేశ్వరరావు,కొండ నాగేశ్వరరావు, మోదుమూడి సద్గుణరావు పాల్గొన్నారు.