Sep 16,2021 00:06

మాట్లాడుతున్న కందిమళ్ల కోటేశ్వరావు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న తలపవెట్టిన భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందిమళ్ళ రామకోటేశ్వరరావు కోరారు. స్థానిక మాదాల అంజయ్య బిల్డింగ్‌ ఆవరణలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నార్నె సింగయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నెం ఆదియ్య, బాచిన కోటేశ్వరరావు, బండి సాంబయ్య, రామ్మోహన్‌రావు, భానూప్రసాదు, అంజయ్య, రామలింగారెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్రావు, మార్క్‌ తదితరులు పాల్గొన్నారు.