May 05,2021 10:26

న్యూఢిల్లీ : కరోనా కల్లోల్లంతో భారత్‌ ఘోషిస్తోంది. గడచిన 24 గంటల్లో 3.82 లక్షల కేసులు నమోదయ్యాయి. భారత్‌ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇదే రికార్డు సంఖ్య. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2.06 కోట్లకు చేరువైంది. మరణాల్లో కూడా భారత్‌ గరిష్ట సంఖ్యను నమోదు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,780 మంది మరణించారు. ఈ సంఖ్యతో కలిపి 2,26,188 ప్రాణాలు కోల్పోయారు. కరోనా తీవ్ర స్థాయిలో నమోదు కావడంతో అనేక మంది లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం సుముఖంగా లేదని సమాచారం. గడిచిన 24 గంటల్లో 3,38,439 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 34,87,229 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 29,48,52,078 శాంపిల్స్‌ను పరీక్షించారు.
మహారాష్ట్రలో అత్యధికంగా కోవిడ్‌ కేసులు నమోదౌతున్నాయి. మహారాష్ట్ర అనంతరం కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.