
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారంనుండి జరగనున్న మూడోటెస్ట్‌కు మొతేరా ఆతిథ్యమివ్వనుంది. ఫ్లడ్‌లైట్ వెలుగుల మధ్య ఈ మైదానంలో తొలిసారి డే/నైట్ టెస్ట్ జరగనుంది. ఆఖరి రెండు టెస్ట్‌లతోపాటు టి20 సిరీస్ ఈ వేదికపైనే జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 1982లో నిర్మించబడింది. ఈ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్న బిసిసిఐ, ఇరుజట్ల క్రికెటర్లు స్టేడియంపై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పునరుద్ధరణకు ముందు ఈ స్టేడియం సీట్ల సామర్థ్యం 49 వేలు మాత్రమే. ఇప్పుడు దీని సామర్థ్యం రెండింతలకు పెరిగింది. చారిత్రక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం సామర్థ్యం 90 వేలే కాగా, ఇప్పుడు దీనిని మొతేరా స్టేడియం 1,10,000 అభిమానులు కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. ఇది ప్రపంచంలోని రెండో అతిపెద్ద క్రీడా స్టేడియం. ఈ మైదానం 12 టెస్టులకు ఆతిథ్యమిచ్చింది. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్‌ను 2009లో శ్రీలంక ఒక ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 760 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగులకు ఆలౌటైంది.
నెలాఖరుకు అహ్మదాబాద్‌కు వచ్చేయండి..
ఆటగాళ్లకు బిసిసిఐ ఆదేశం
టి20 సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్ళంతా మార్చి 1నాటికి అహ్మదాబాద్‌కు వచ్చేయాలని బిసిసిఐ ఆదేశించింది. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ అహ్మదాబాద్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 12 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఆరంభమయ్యే టి20 సిరీస్‌కు శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా, భువనేశ్వర్ కుమార్ తదితర ఆటగాళ్లు ఎంపికయ్యారు. వీరంతా విజరు హజారే ట్రోఫీలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా ఐదు నగరాల్లో ఏర్పాటు చేసిన బయో బబుల్స్‌లో వారంరోజులు ఉండాల్సి ఉంది.