Oct 15,2020 22:07
భారత్‌ ఇంకా బలహీనమే.. : మూడీస్‌

న్యూఢిల్లీ/ న్యూయార్క్‌ : భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనంగానే ఉందని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తెలిపింది. ప్రభుత్వం రెండో దఫా ప్రకటించిన పరిమిత ఉద్దీపన ప్యాకేజీ.. దేశ వృద్థి రేటుకు నామమాత్ర మద్దతును మాత్రమే అందించనుందని పేర్కొంది. 2020-21లో భారత జిడిపి ఏకంగా మైనస్‌ 11.5 శాతం క్షీణించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. గడిచిన జూన్‌ త్రైమాసికంలో దేశ జిడిపి ఏకంగా 23.9 శాతం పతనం అయిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 12న రాష్ట్రాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యలు జిడిపికి కేవలం 0.2 శాతం మద్దతు చేయనున్నాయని మూడీస్‌ అంచనా వేసింది. రెండు దఫాల్లోనూ ప్రకటించిన ఉద్దీపనలు జిడిపికి కేవలం 1.2 శాతం మాత్రమే మద్దతును ఇవ్వనున్నాయని ఈ రేటింగ్‌ ఎజెన్సీ విశ్లేషించింది.