Jan 16,2021 11:06

గబ్బా : గబ్బా స్టేడియం వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. అంతకుముందు టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన క్రమంలో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆడేందుకు మైదానంలోకి దిగింది. అయితే కమ్మిన్స్‌ బౌలింగ్‌లో ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌ (7) ఔటయ్యాడు. ఆ తరువాత అర్ధసెంచరీ దిశగా వెళుతున్న రోహిత్‌ శర్మ (44 : 74 బంతుల్లో 6 ఫోర్లు)ను లైయన్‌ వికెట్‌ తీశాడు. మిచెట్‌ స్టార్క్‌ చేతికి చిక్కి రోహిత్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా (8), అజింక్య రహానె (2) క్రీజులో ఉన్నారు.