Jul 28,2021 23:39

మంజునాథ్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

ప్రజాశక్తి - వినుకొండ: పట్టణానికి చెందిన నాగండ్ల మంజునాథ్‌ అంతర్జాతీయ థర్డ్‌ సౌత్‌ ఏషియన్‌ యూత్‌ రూరల్‌ గేమ్స్‌కు భారతదేశం జటుక్టకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మంజూనాథ్‌ను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బుధవారం సత్కరించారు. ఆగస్టు 7వ తేదీన భూటాన్‌లో జరిగే పోటీల్లో మంజునాథ్‌ ప్రతిభ చూపి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షింకారు. రన్నింగ్‌ క్రికెట్‌ వివిధ క్రీడా విభాగాల్లో జాతీయ స్థాయిలో రానిచ్చి అంతర్జాతీయ స్థాయిలో వినుకొండ నుండి గతంలో ఎంపికయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గంధం బాల్‌రెడ్డి, జెండా రామయ్య, ఎం.ఎన్‌. ప్రసాద్‌ పాల్గొన్నారు.