May 13,2022 10:07
  • కాంస్య పతకం ఖాయం

ఉబర్‌ కప్‌లో ఓటమే.. బ్యాంకాక్‌: థామస్‌ సెమీఫైనల్లోకి పురుషుల జట్టు ప్రవేశించగా.. ఉబర్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత మహిళల జట్టు ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన థామస్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 3-2తో మలేషియాపై సంచలన విజయం నమోదు చేసుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-23, 9-21తో లీ-జి-జియో చేతిలో ఓటమిపాలుకాగా.. డబుల్స్‌లో సాత్త్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ జోడీ 21-19, 21-15తో జో-ఇజుద్దీన్‌లపై గెలిచారు. దీంతో 1-1తో స్కోర్‌ సమం కాగా.. రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-11, 21-17తో జీ-యంగ్‌పై విజయం సాధించడంతో భారత్‌ 2-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. రెండో పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌-విష్ణువర్ధన్‌ జోడీ 19-21, 17-21తో పరాజయాన్ని చవిచూడడంతో స్కోర్‌ 2-2తో సమమైంది. ఇక నిర్ణయాత్మక మూడో సింగిల్స్‌ మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌ను ప్రణరు 21-13, 21-8తో ముగించి భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేయడంతోపాటు కాంస్య పతకం ఖాయం చేశాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో భారత్‌ పటిష్ట డెన్మార్క్‌తో తలపడనుంది.
 

ఉబర్‌ కప్‌ క్వార్టర్స్‌లో నిరాశే..
ఉబర్‌ కప్‌ భారత మహిళల బృందానికి నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 0-3 తేడాతో థారులాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలి సింగిల్స్‌లో పివి సింధు 21-18, 17-21, 12-21తో ఇంటనాన్‌ చేతిలో పోరాడి ఓడింది. దీంతో థారులాండ్‌ జట్టు 1-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఇక మహిళల డబుల్స్‌లో శృతి మిశ్రా-సిమ్రన్‌ సింఘి జోడీ 16-21, 13-21తో కిటిథరకుల్‌-ప్రజోంజల్‌ చేతిలో, రెండో సింగిల్స్‌లో ఆకర్షీ కశ్యప్‌ 16-21, 11-21తో ఛోఛువాంగ్‌ చేతిలో పరాజయాల్ని చవిచూసారు. దీంతో భారత్‌ క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది.