Jan 14,2021 01:32

గుంటూరులో చ‌ట్ట ప్ర‌తుల‌ను ద‌హ‌నం చేస్తున్న నాయ‌కులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, సిపిఎం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు బ్రాడీపేటలోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద భోగి మంటల్లో రైతు వ్యతిరేక చట్టాల ప్రతుల్ని దగ్ధం చేశారు. కార్యక్రమానికి రైతు సంఘం తూర్పు గుంటూరు జిల్లా అధ్యక్షులు కంచుమాటి అజరుకుమార్‌ అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ ఈ చట్టాల వల్ల ప్రభుత్వ మార్కెటింగ్‌ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, దేశంలో ఆహార సమస్య ఉత్పన్నమౌతుందన్నారు. కేంద్రం మొండి వైఖరి వీడి చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ సంఘాల నాయకులు బి.శ్రీనివాసరావు, ఎన్‌.వెంకటేశ్వర్లు, పి.మనోజ్‌, ఎన్‌.కాళిదాసు, ప్రేమ్‌కుమార్‌, నాగమల్లేశ్వరరావు, హనుమంతురావు, కళాధర్‌ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో సుమారు 26 ప్రాంతాల్లో వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. ప్రగతినగర్‌, పుచ్చలపల్లి సుందరయ్యనగర్‌, పాతగుంటూరులోని బాలాజీ నగర్‌, గణేష్‌నగర్‌, ముత్యాలరెడ్ది నగర్‌, నల్లచెరువు తదితర చోట్ల దగ్ధం చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. పద్మ, ఎల్‌.అరుణ, కె.రత్నకుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సిఐటియు నగర పశ్చిమ, తూర్పు ప్రధాన కార్యదర్శులు బి. ముత్యాలరావు, కె.శ్రీనివాసరావు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మినారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర తూర్పు అధ్యక్షులు చల్లా సుబ్బరాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పూర్ణ మహేష్‌ పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కార్యక్రమంలో రైతు సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షులు గద్దె చలమయ్య మాట్లాడారు. సుందరయ్య కాలనీ, భావనారుషి నగర్‌, కొత్తపేట వినాయకుని గుడి వద్ద, సొసైటీ, పాత బస్టాండ్‌ సెంటర్‌ తదితర ప్రాంతాలలో చట్టాల ప్రతులను దహనం చేశారు. నాయకులు జి.విజరుకుమార్‌, పి.పాములయ్య, లింగయ్య, దుర్గారావు, వీరబ్రహ్మం, ప్రభాకర్‌, విమల, వెంకటేశ్వరరావు, పుల్లారావు, సూర్యప్రకాశరావు, జ్యోతి, బాలకృష్ణ, రామలింగరాజు పాల్గొన్నారు. సిపిఐ కార్యాలయం వద్ద కార్యక్రమంలో ఎన్‌.వేణుగోపాల్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్విమ్మర్స్‌ గ్రూప్‌ సాగర్‌ కాల్వ ఒడ్డున వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేసింది. తాడేపల్లి రూరల్‌ మండలం కుంచనపల్లిలో పలు చోట్ల నిర్వహించిన చట్టాల దహనంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడారు. నాయకులు డి.వెంకటరెడ్డి, రంగారావు, రమేష్‌, కోటేశ్వరరావు, మత్తయ్య, రాజేష్‌ పాల్గొన్నారు. పెదనందిపాడు పాత బస్టాండ్‌ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో చట్టాల ప్రతులను దహనం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడారు. నాయకులు కె.నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి ఎన్‌.బాలకృష్ణ పాఒ్గన్నారు. నరసరావుపేట, పాలపాడు, ఇక్కుర్రు, పరగటిచర్ల, సంతగుడిపాడు, మర్రిచెట్టుపాలెం గ్రామాల్లో సిపిఎం నాయకులు చట్టాల ప్రతులను దహనం చేశారు. కె.రామారావు, కె.నాగేశ్వరరావు, పెద్దిరాజు, ఆంజనేయులు, శిలార్‌ మసూద్‌, శివకుమారి, మొటిల్డాదేవి, పాపారావు పాల్గొన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పురపాలక సంఘం వద్ద నిరసనలో శిలార్‌ మసూద్‌, యోహాన్‌, మల్లయ్య, చిన్న అల్లాబక్షు, శేఖర్‌, ఖాదర్‌ పాల్గొన్నారు. పెదకాకానిలో ప్రజా సంఘాల నిరసనలో ఎన్‌.శివాజీ, సాంబయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. రాజుపాలెం నిరసనలో ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, దుర్గాబాయి, రైతులు పాల్గొన్నారు. రేపల్లె నెహ్రూ బొమ్మ సెంటర్‌ వద్ద నిరసనలో సిహెచ్‌.మణిలాల్‌ మాట్లాడారు. జె.ధర్మరాజు, కె.రమేష్‌బాబు, ఆశీర్వాదం, వెంకటేశ్వరరావు, సుబ్బారావు పాల్గొన్నారు. ముప్పాళ్లలో ఎం.వెంకటరెడ్డి, జాలయ్య, బాలయ్య, సైదా, సత్యనారాయణరెడ్డి, కోటేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. అమరావతిలో బి.సూరిబాబు, శివయ్య, సుబ్బు సైదా, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం మొహిద్దినవలి, నాని పాల్గొన్నారు. చిలకలూరిపేటలో నరసరావుపేట సెంటర్‌, పిల్లి అంకమ్మ చౌక్‌, బొప్పూడిలో అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. పి.వెంకటేశ్వర్లు, ఎస్‌.బాబు, లూధర్‌, సీఆర్‌ మోహన్‌, రాధాకృష్ణ, కరిముల్లా, డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌రావు, సుబ్బాయమ్మ, సుభాని, గౌస్‌ పాల్గొన్నారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరులో చట్టాలను దహనం చేశారు. ఎం.పుణ్యశ్రీనివాసరవు, కోటేశ్వరావు, రమేష్‌, పాల్గొన్నారు. పిడుగురాళ్లలోని మాచర్ల బస్‌స్టాండ్‌ వద్ద భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతులు దహనం చేశారు. నాయకులు టి.శ్రీనివాసరావు, లక్ష్మీ ప్రసాద్‌, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, పున్నయ్య, మేకల కోటేశ్వరరావు, వీరయ్య, రామారావు, పాపారావు, వెంకటేశ్వర్లు, సత్యం, చిన్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద, రూరల్‌ గ్రామం గుడివాడలో నిరసనలో ములకా శివసాంబిరెడ్డి, డి.శివకోటేశ్వరరావు, హుస్సేన్‌వలి, రాజ్యలక్ష్మి, బి.వెంకటేశ్వరరావు, చిట్టిబాబు, సుబ్బారావు, బెన్హర్‌ పాల్గొన్నారు. వేమూరు మండలం కుచ్చెళ్ళపాడులో బి.అగస్టీన్‌, చంద్రశేఖర్‌, సుబ్బారావు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలోని 22వ వార్డులోని సుందరయ్య నగర్‌లో వామపక్షాల నిరసనలో పి.బాలకృష్ణ, కాటంరాజు, శివ, భావన్నారాయణ దుర్గాప్రసాద్‌, వెంకటేశ్వరరావు, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు. మంగళగిరి రూరల్‌ మండలం ఆత్మకూరు, యర్రబాలెం, కాజలో నిరసనల్లో ఎం.పకీరయ్య, జ్యోతిబసు, దుర్గారావు, వీరవెంకయ్య, సుందరయ్య, రామరాజు, బి.కోటేశ్వరి, బాబు వరప్రసాద్‌, వి.పూర్ణయ్య, సూరిబాబు, సాంబశివరావు, నాగుల్‌మీరా పాల్గొన్నారు. నకరికల్లు, చేజర్ల, కుంకలగుంటలో చట్టాల ప్రతులను దహనం చేశారు. లక్ష్మారెడ్డి, అప్పిరెడ్డి, వెంకటేశ్వర్లు, సాంబయ్యనాయక్‌, బాలమ్మ, రామాంజి నాయక్‌ పాల్గొన్నారు. యడ్లపాడు, ఉన్నవ, లింగారావుపాలెంలో రైతు, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు. జె.శంకరరావు, ఎం.పద్మారావు, జి.హరిబాబు, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. వినుకొండలోని పల్నాడు రోడ్డులో నిరసనలో జి.ఏసు, షేక్‌ రంజాన్‌బి, తిరుమల లక్ష్మి, నాసర్‌బి, ఎం.చిదంబరం, వెంకటప్పయ్య, వెంకటేశ్వర్లు, అక్బర్‌బాషా పాల్గొన్నారు. జాలపాలెం, విఠంరాజుపల్లి, నూజెండ్ల మండలం గుర్రప్పనాయుడుపాలెం, ఖమ్మంపాడు, చింతలచెరువు, బొల్లాపల్లి మండలంలోని రేమిడిచర్ల, గుమ్మనంపాడు, బొల్లాపల్లి, ఈపూరు మండల కేంద్రంలో నిరసనలు జరిగాయి. కె.హనుమంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆదినారాయణ, ఆశీర్వాదం, సత్యనారాయణ, శ్యామల కోటిరెడ్డి పాల్గొన్నారు. బాపట్ల పట్టణం చీలురోడ్డు సెంటర్‌, బేతపూడి, వెదుళ్ళపల్లి, నందిరాజుతోటలో నిరసనలు తెలిపారు. ఎన్‌.కోటేశ్వరరావు, వై.భాస్కర్‌రావు, కె.కోటేశ్వ రరావు, లక్ష్మణ, భోగిరెడ్డి పాల్గొన్నారు. ఈపూరులో చేపట్టిన నిరసనలో ఎం.దేవస హాయం, సాంబశివరావు, రామాంజనేయులు, స్వర్ణ ముసలయ్య పాల్గొన్నారు. చుండూరు, పెద్ద గెదెలవర్రు, చిన్న గాజులువర్రులో నిరసనల్లో టి.కృష్ణమోహన్‌, కె.శ్రీమన్నారాయణ, హనుమం తరావు, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గోపి, పి.చంద్ర శేఖర్‌, కిషోర్‌ పాల్గొన్నారు. దాచేపల్లిలో ప్రజా సంఘాలు చట్టాలను దహనం చేశాయి. అమృత లూరులో మాజీ ఎంపిపి మైనేని రత్నప్రసాద్‌, డి.అంబేద్కర్‌, విజయ భాస్కర్‌, సతీష్‌ కుమార్‌, సుబ్బారావు, ఖాదర్‌వలీ, శ్రీనివాసరావు, గెల్లి సత్యన్నారాయణ, వీరరాఘవయ్య, పరుచూరి జగదీష్‌, నార్ల రాజా, సర్‌ విజ్జీ పాల్గొన్నారు.