Jan 15,2022 00:51

ఒటిఎస్‌ జీవోను పత్రులు దహనం చేస్తున్న కందుల

ప్రజాశక్తి-మార్కాపురం : టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భోగి మంటల్లో ఒటిఎస్‌ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక లోటును పూడ్చుకునేందకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలపై పిడుగులాంటి భారాన్ని ఒటిఎస్‌తో మోపారన్నారు. ఎప్పుడో... ఎవరో ఇచ్చిన ఇంటికి ఇప్పుడు డబ్బు చెల్లించాలనడం సరికాదన్నారు. ఇంటి రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేయాలని డిమాండ్‌ చేశారు. గిద్దలూరు : టిడిపి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రోడ్డుపై భోగి మంటలు వేసి అందులో ఒటిఎస్‌ జీవో పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ప్రజలపై భారం మోపే ఒటిఎస్‌ప పథకాన్ని రద్దు చేయాలన్నారు. నిత్యావసర ధరలు తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.