Nov 26,2022 20:33

భోపాల్‌ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌ జిల్లాలో సాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా శనివారం రాహుల్‌, చెత్త కాగితాలు ఏరుకునే ఒక మహిళతో మాట్లాడారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. తన కుటుంబం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె వివరించింది. విద్యుత్‌, నీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా లేకుండా వున్నామని చెప్పుకుంది. తమ బాధలను వినేవారు ఎవరూ లేరని, తమ పిల్లలను స్కూలుకు కూడా పంపలేకపోతున్నామని ఆమె తన గోడు చెప్పుకుంది. రాజ్యాంగ దినోత్సవాన్ని  పురస్కరించుకుని శనివారం సాయంత్రం అంబేద్కర్‌ జన్మ స్థలమైన మౌహౌకి యాత్ర చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌, మల్లికార్జున ఖార్గె ప్రసంగించారు.